
దర్శక శిఖరం భారతీరాజాకు సినీ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది. ఆయన కడసారి దర్శనం కోసం చెన్నైలోని భారతీరాజా నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖలు తరలివస్తున్నారు. దిగ్గజ దర్శకుడి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజా పార్థీవ దేహంపై తలవాల్చి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీరాజా
అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సీఎం విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు.
అంతకుముందు, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) తమ వ్యవస్థాపక అధ్యక్షుడైన భారతీరాజాకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వ గౌరవ వందనాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి విజయ్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ అభ్యర్థనకు తక్షణమే స్పందించిన సీఎం విజయ్.. ఈ గౌరవప్రదమైన నిర్ణయాన్ని వెల్లడించారు. అంతకు ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితర సినీ ప్రముఖులు భారతీరాజాకు నివాళులు అర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
Film director Bharathiraja no more:
TN CM Joseph Vijay pays respects at the late director's residence in Chennai, announces state honours for director. pic.twitter.com/ThAiCeCHB7
— News Arena India (@NewsArenaIndia) June 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి