AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay : సీఎం విజయ్ కీలక నిర్ణయం.. త్రిష సినిమాకు బంపర్ ఆఫర్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల క్రితం పార్టీని స్థాపించిన విజయ్ తొలి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సాధించారు. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కు ప్రజాదరణ మరింత పెరిగింది.

CM Vijay : సీఎం విజయ్ కీలక నిర్ణయం.. త్రిష సినిమాకు బంపర్ ఆఫర్..
Vijay, Trisha
Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 2:55 PM

Share

మొన్నటివరకు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీయే ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దాంతో ఇప్పుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ సీఎం సీట్లో కూర్చున్న దగ్గర నుంచి సామాన్యులను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బడి, గుడి, బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఆదేశించారు సీఎం విజయ్. దాంతో రాష్టం మొత్తం సీఎం విజయ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబందించి విజయ్ తీసుకున్న నిర్ణయం పై సినీ లవర్స్, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

తమిళనాడులో ఇక పై స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది విజయ్ సర్కార్. తమిళనాడులో చాలా కాలంగా స్పెషల్ షోలకు పర్మిషన్ లేదు. ఎంత పెద్ద సినిమా విడుదలైన స్పెషల్ షోలకు గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు విజయ్ ప్రభుత్వం రాగానే సినిమా పరిశ్రమకు ఊరట లభించింది. అయితే త్రిష సినిమాతోనే ఇది మొదలుకానుంది. త్రిష , సూర్య నటించిన కరుప్పు తెలుగులో( వీరభద్రుడు) సినిమాకు మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

దాంతో చిత్ర నిర్మాతలు విజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉదయం 9గంటలనుంచి రాత్రి రెండు గంటల వరకు మొత్తం 5 షోలు పడనున్నాయి. ‘కరుప్పు’ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ నూయి విడుదల చేశారు. ఈ ట్రైలర్ పర్లేదు అనిపించుకుంది. చాలా కాలంగా సరైన హిట్ లేక సూర్య సతమతం అవుతున్నారు. మరి ఈ సినిమా సూర్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

వీరభద్రుడు మూవీ ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us