ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం బృందానికి తమిళనాడు సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. మొత్తం 91 మందికి తలా లక్ష రూపాయిల నగదు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఇంటిని కేటాయిస్తూ సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీచేశారు. ఏనుగు రఘుని సంరక్షించి, షార్ట్ ఫిలింలో నటించిన బొమ్మన్, వల్లియమ్మాళ్ ని సత్కరించారు సీఎం స్టాలిన్. రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకను ప్రపంచవేదికపై రెపరెపలాడించింది ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం, తమిళనాడుకి చెందిన ద ఎలిఫెంట్స్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ బృందం. ద ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్ ద్వారా తమిళనాడు రాష్ట్రానికీ, ముదుమలై జంతువుల పరిరక్షణ కేంద్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో పరిరక్షణ కేంద్రం లో పనిచేన్తున్న సిబ్బంది సహా చిత్ర బృందంలోని 91 మందికి తలా లక్ష రూపాయల నజరానా ప్రకటించారు ముఖ్యమంత్రి స్టాలిన్. తప్పిపోయిన ఏనుగు రఘుని రక్షించి..కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది ఓ కుటుంబం. నోరులేని ఏనుగుని కన్నబిడ్డకన్నా అమితంగా ప్రేమిస్తారు బొమ్మన్..వల్లియమ్మాళ్‌లు. ఏనుగు రఘు సైతం వారిపై అంతకు మించిన ప్రేమను కురిపిస్తుంది. అంతేకాదు బొమ్మన్..వల్లియమ్మాళ్‌ల మధ్య అనుబంధాన్ని పెళ్ళి వరకు వచ్చేందుకు కారణమౌతుంది ఏనుగు రఘు.
మాటలు రాకున్నా..భాష లేకున్నా..జంతువులకీ మనుషులకీ మధ్య శతాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించారు ద ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్‌ఫిల్మ్‌లో. తమిళంలో నిర్మించిన ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని యావత్ ప్రపంచ ప్రజల మన్ననలు అందుకుంది. ఇందులో భాగంగానే ది ఎలిఫెంట్ విస్పరర్స్ లో కనిపించిన ఎలిఫెంట్ కేర్ టేకర్ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులకు.. తమిళనాడు సీఎం స్టాలిన్ 2 లక్షల బహుమతి అందజేశారు. అలాగే ఎలిఫెంట్ కేర్ క్యాంపు లో వర్క్ చేసే 91 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
#TheElephantWhisperers #AcademyAwards பெற்று, நம் வனத்துறை செயல்பாடுகளை உலகறிய செய்துள்ளது.
திருமிகு.பொம்மன் – பெள்ளியைப் பாராட்டி ரூ.1 லட்சம் வழங்கி, தெப்பக்காடு & கோழிகமுத்தி யானைகள் முகாம் 91 பணியாளர்களுக்கு தலா 1 லட்சமும், வீடுகள் கட்ட ரூ.9.10 கோடி நிதியுதவியும் அறிவித்தேன். pic.twitter.com/mtJgnnZl8G
— M.K.Stalin (@mkstalin) March 15, 2023
முதுமலை யானைகள் வளர்ப்பு முகாமில் எடுக்கப்பட்ட ஆஸ்கார் விருது பெற்ற ‘The Elephant Whisperers’ ஆவணப் படத்தில் இடம்பெற்ற ரகு எனும் யானைக் குட்டியின் பராமரிப்பாளர்களான திரு. பொம்மன், திருமதி பெல்லி தம்பதியரை
1/2 pic.twitter.com/R56E4hXqHj
— CMOTamilNadu (@CMOTamilnadu) March 15, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..