మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయోబుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని కన్ఫార్మ్ చేసినట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తుంది. అలాగే ఇందులో మాస్ మాహారాజా రవితేజ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడట. విజయ్ సేతుపతి గతంలో సైరా సినిమాలో చిరు అనుచరుడిగా నటించి మెప్పించాడు.. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సిక్వెన్స్ లో విజయ్ సేతుపతి పాత్ర రివీల్ కాబోతుందని.. చాలా పవర్ ఫుల్ పాత్రలో విజయ్ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని టాక్. ఈ సినిమాలో చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి మాస్టర్, ఉప్పెన వంటి చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరుకు విలన్ పాత్రలో నటించబోతుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెంచేసిందంటున్నారు ఫ్యాన్స్.