Vadivelu: వడివేలుది ఒమిక్రాన్‌ వేరియంటా..! వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

| Edited By: Shaik Madar Saheb

Dec 26, 2021 | 8:08 AM

Vadivelu: కోవిడ్‌ విధ్వంసం మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించిన వెంటనే

Vadivelu: వడివేలుది ఒమిక్రాన్‌ వేరియంటా..! వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
Vadivelu
Follow us on

Vadivelu: కోవిడ్‌ విధ్వంసం మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించిన వెంటనే మళ్లీ యాక్టివ్‌గా మారింది. భారత్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో చాలా మంది స్టార్‌లు దీని బారిన పడ్డారు. అంతేకాదు తమిళ హాస్యనటుడు వడివేలు కూడా దీని గ్రిప్‌లోకి వచ్చేశాడు. ఇటీవల వడివేలు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, దర్శకుడు సూరజ్ ‘న్యూ శేఖర్ రిటర్న్స్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

వడివేలు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం అతనికి చికిత్స చేస్తోంది. అదే సమయంలో వడివేలుకు ఓమిక్రాన్ వేరియంట్‌ సోకిందా అని భయపడుతున్నారు. అయితే ఇది ఇంకా ధృవీకరించలేదు. వడివేలుకి చికిత్స చేస్తున్న వైద్యులు ఎటువంటి అప్‌డేట్‌ చెప్పలేదు. కానీ మీడియా ప్రకారం.. వడివేలు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. వడివేలు అస్వస్థతకు గురయ్యారనే వార్త అందరికి తెలిసింది. అతని అభిమానులు అతని కోసం ప్రార్థిస్తున్నారు అలాగే అతని ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకోవాలని ఆశిస్తున్నారు.

గత నెల ప్రారంభంలో నటుడు కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇదే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్యంగా ఉన్నారు. వడివేలు తమిళ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ హాస్యనటులలో ఒకరు. అతని హాస్య శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతని అభిమానులు అతన్ని వైగై పుయల్ అని పిలుచుకుంటారు. త్వరలో వడివేలు ‘ నయా శేఖర్ రిటర్న్స్’ సినిమాతో తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. దీని కోసం అతని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇటీవల మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. ఇది బాగా నచ్చింది.

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

యాషెస్ సిరీస్ జరుగుతుండగా బాధాకరమైన వార్త.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మరణించాడు..

PM Modi: ఓమిక్రాన్ సంక్షోభంపై ప్రసంగించిన ప్రధాని మోడీ.. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు..