కోలీవుడ్ స్టా్ర్ హీరో సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా కంగువ. డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఏకంగా 38 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారట మేకర్స్. దీంతో కంగువ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఈ క్రమంలోనే గురువారం షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగిందని.. దీంతో హీరో సూర్య స్వల్పంగా గాయపడినట్లుగా తెలిసింది. కంగువ సినిమాలో పోరాట సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్న సమయంలో రోప్ కెమెరా అదుపు తప్పి సూర్య భుజంపై పడింది. దీంతో అతడికి స్వల్పంగా గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో సూర్య ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందారు. తమ హీరో త్వరంగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు సూర్య. అలాగే ప్రమాదం ఎలా జరిగిందని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “ప్రియమైన మిత్రులారా.. శ్రోయోభిలాషులు.. నా అభిమానులు. మీరు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ నేను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం స్థిమితంగా ఉంది. మీ అందరి ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు. సూర్య తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Dear Friends, well wishers & my #AnbaanaFans
Heartfelt thanks for the outpouring ‘get well soon’ msgs.. feeling much better.. always grateful for all your love 🙂— Suriya Sivakumar (@Suriya_offl) November 23, 2023
ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఈవిపి ఫిల్మ్ సిటీలో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. షూటింగ్ వాయిదా పడింది. నసరత్‌పేట పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూర్య చివరిసారిగా పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈటీ చిత్రంలో కనిపించారు. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక కంగువ తర్వాత సూర్య తన 43 చిత్రంలో నటించనున్నారు. ఇందులో నజ్రియా హీరోయిన్.
This riveting docu series makes me want to know more.. congrats to the whole crew behind this project. Special mention to Nakheeran Team.https://t.co/r4ToRj8HKn#UnseenVeerappanTapes #VeerappanOnZEE5
— Suriya Sivakumar (@Suriya_offl) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.