స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఎగబడి చూసేస్తోన్న జనాలు.. రెండేళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పాట..

సాధారణంగా సినీ పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఈ పాటల కోసం కొందరు తారలు ప్రత్యేకంగా ఉండేవారు. సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి అంటే గ్లామర్స్ సాంగ్స్ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది స్టార్ హీరోయిన్స్ స్పెషల్ పాటలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఎగబడి చూసేస్తోన్న జనాలు.. రెండేళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పాట..
Tamannah

Updated on: Jan 17, 2026 | 9:13 PM

గత రెండేళ్లుగా యూట్యూబ్ లో ఓ సాంగ్ రచ్చ చేస్తుంది. స్టార్ హీరోయిన్ నటించిన ఆ స్పెషల్ పాటను చూసేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ పాట పేరు ఆజ్ కీ రాత్. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 1 బిలియన్ అంటే 1000 మిలియన్ లేదా 100 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డు సృష్టించింది. 2024 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘స్త్రీ 2’లో మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో నటించింది. ఈ సాంగ్ చాలా తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. తమన్నా లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ పాట థియేటర్లలో విడుదలైనప్పుడు అభిమానులు ఈలలు, డ్యాన్స్ స్టెప్పులతో రచ్చ చేశారు.

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

ఇప్పటికీ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన భారతీయ పాటల జాబితాలో ఇది అగ్రస్థానంలో ఉంది. సచిన్-జిగర్ స్వరపరిచిన ఈ పాటను మధుబంటి బాగ్చి, దివ్య కుమార్ పాడారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం యువతరాన్ని ఆకర్షించేలా రూపొందించారు. ఒక స్త్రీ తన ప్రేమికుడిని దూరం నుండి తాకకుండా ఆనందించమని చెప్పే దాని సాహిత్యం అభిమానులలో వైరల్ అయ్యింది. గతంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలా’ పాటతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ‘ఆజ్ కీ రాత్’ పాటతో తన విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

తమన్నా తన సోషల్ మీడియా పేజీలో 1 బిలియన్ వ్యూస్ దాటిన విజయాన్ని గర్వంగా పంచుకుంది, తన అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. భారతీయ సినిమాల్లో చాలా తక్కువ పాటలు ఈ మైలురాయిని చేరుకున్నప్పటికీ, తమన్నా పాట ఒక మైలురాయిగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..