Tamannaah: తమన్నా బౌన్సర్ల అత్యుత్సహం.. మీడియా పై దాడి.. తిరగబడిన జర్నలిస్టులు

హీరోయిన్ తమన్నా బౌన్సర్లు.. హల్చల్ చేశారు. కెమెరామెన్లపై దాడి చేస్తూ.. నానా భీభత్సం సృష్టించారు. తన లేటెస్ట్ పిల్మ్ బబ్లీ బౌన్సర్ ప్రమోషన్ కోసం హైదారాబాద్‌కు వచ్చిన తమన్నా అండ్ టీం

Tamannaah: తమన్నా బౌన్సర్ల అత్యుత్సహం.. మీడియా పై దాడి.. తిరగబడిన జర్నలిస్టులు
Tamannaah
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 4:10 PM

హీరోయిన్ తమన్నా(Tamannaah) బౌన్సర్లు.. హల్చల్ చేశారు. కెమెరామెన్లపై దాడి చేస్తూ.. నానా భీభత్సం సృష్టించారు. తన లేటెస్ట్ పిల్మ్ బబ్లీ బౌన్సర్ ప్రమోషన్ కోసం హైదారాబాద్‌కు వచ్చిన తమన్నా అండ్ టీం.. అన్నపూర్ణ స్టూడియోలో ఓప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇక ఆ ప్రెస్ మీట్ తరువాత గా తమన్నాతో ఇంటర్య్వూ తీసుకునేందుకు రిపోర్టర్ల ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో .. రంగంలోకి దిగిన బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే మరికొందరు బౌన్సర్లు రిపోర్టర్లపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో రిపోర్టర్లు.. కెమెరామెన్లు ఏకమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా అక్కడో చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోలో తమన్నా బౌన్సర్ ల దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో బౌన్సర్ ఒకరు డస్ట్ బిన్ ని ఎత్తి దాడి చేస్తామని బెదిరించడం కనిపిస్తుంది. తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..