Taapsee Pannu: మిషన్ ఇంపాజిబుల్ కోసం తాప్సీ నయా గెటప్.. కీలక పాత్రలో పంజాబీ బ్యూటీ..

|

Jul 21, 2021 | 8:24 PM

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‏లో తాప్సీ ఒకరు. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.

Taapsee Pannu: మిషన్ ఇంపాజిబుల్ కోసం తాప్సీ నయా గెటప్.. కీలక పాత్రలో పంజాబీ బ్యూటీ..
Taapsee Pannu
Follow us on

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‏లో తాప్సీ ఒకరు. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఇక ఇటు తెలుగులో మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అటు బాలీవుడ్‏లోనూ అవకాశాలను అందుకుంది తాప్సీ. అదే సమయంలో అక్కడ ఆమె నటించిన సూపర్ హిట్స్ లభించడంతో.. పూర్తిగా బాలీవుడ్‏కు షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‏ఫాంలలోనూ తాప్సీ దూసుకుపోతుంది. ఇటీవల నెట్‏ఫ్లిక్స్ వేదికగా విడుదలైన హసీనా దిల్రుబా అనే సినిమాతో సక్సెస్ అందుకుంది తాప్సీ.

చాలా కాలం తర్వాత తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ గ్రామంలో జరిగే హంటింగ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇందులో స్వరూప్ ఓ డిటెక్టివ్ గా నటిస్తున్నారని టాక్. తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‏లో జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‏లో తాప్సీ జాయిన్ అయ్యింది. తాజాగా సమాచారం ప్రకారం తాప్సీ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. హిందీలో ‘రష్మీ రాకెట్’ ‘లూప్ లాపేట’ ‘దొబారా’ ‘శభాష్ మిథు’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే తమిళ్ లో ‘జనగణమన’ ‘అనబెల్లె సుబ్రహ్మణ్యం’ ‘ఏలియన్’ వంటి చిత్రాల్లో తాప్సీ కీలక పాత్రలు పోషిస్తోంది.

Also Read: Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..

Ranga Maarthaanda: ‘రంగమార్తాండ’ గురించి కీలక అప్‌డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..