AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే..

ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అక్షా పార్ధసాని సైతం తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పేస్తుందట. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Tollywood: ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2024 | 7:18 AM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీస్ పెళ్లళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అక్షా పార్ధసాని సైతం తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పేస్తుందట. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ?.. తనే టాలీవుడ్ అందాల రాశి తాప్సీ పన్నూ. ఇటీవలే షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ.. తన పర్సనల్ విషయాలను మాత్రం అంతగా షేర చేసుకోదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాప్సీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బాస్‎తో దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవలే తమ రిలేషన్ షిప్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా చేసింది. కానీ వీరిద్దరు కలిసి కనిపించింది చాలా అరుదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తాప్సీ త్వరలోనే తన ప్రియుడు మథియాస్ తో ఏడడుగులు వేయనుందట. మీడియా నివేదికల ప్రకారం ఆమె పెళ్లి వచ్చే నెల మార్చిలో ఉదయపూర్ లో అట్టహాసంగా జరగనుందని టాక్. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహం సిక్కు, క్రైస్తవ సంప్రదాయల ప్రకారం జరగనుందని తెలుస్తోంది. తాప్సీకి కాబోయే భర్త మథియాస్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. అతడు రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్.. ఒలింపిక్ పతక విజేత కూడా. అయితే ఈ వార్తలను తాప్సీ ఇంకా ధృవీకరించలేదు.

మంచు లక్ష్మి నిర్మించి ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ జోడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక్కడ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ నార్త్ లోనే సెటిల్ అయ్యింది ఈ భామ. ఇటీవలే షారుఖ్ ఖాన్ జోడిగా డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది.

View this post on Instagram

A post shared by Mathias Boe (@mathias.boe)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో