సైరా వాయిదా పడనుందా?

టాలీవుడ్‌లో ప్రజెంట్ రెండు భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. ఒకటి సాహో, రెండు సైరా. మెగాస్టార్ చిరంజీవి బెస్ట్‌గా ఉండాలనే పట్టుదలతో చిరుతనయుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారీ హిస్టారికల్ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇంకో 20 శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే మూవీ మొత్తం పూర్తయినట్టే. అన్ని పనులు ముగించుకుని ఈ మూవీని అక్టోబర్ 2న […]

సైరా వాయిదా పడనుందా?
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 10:20 PM

టాలీవుడ్‌లో ప్రజెంట్ రెండు భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. ఒకటి సాహో, రెండు సైరా. మెగాస్టార్ చిరంజీవి బెస్ట్‌గా ఉండాలనే పట్టుదలతో చిరుతనయుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారీ హిస్టారికల్ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని శరవేగంగా పూర్తి చేసేందుకు టీమ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇంకో 20 శాతం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే మూవీ మొత్తం పూర్తయినట్టే. అన్ని పనులు ముగించుకుని ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని చెప్పింది చిత్రయూనిట్. అయితే బాలీవుడ్‌ ట్రేడ్‌లో ఈ మూవీ వాయిదా పడనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

హృతిక్ టైగర్ ష్రాఫ్ నటించిన వార్ మూవీతో పోటీ పడకుండా సైరాను వాయిదా వేసారని ప్రచారం నడుస్తోంది. అక్టోబర్2న వార్ యథాతథంగా రిలీజవుతుంటే , హిందీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు సైరా మూవీని వారం పాటు వాయిదా వేస్తూ అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నారనని ప్రచారం జరిగింది. అయితే వాయిదా విషయాన్ని చరణ్ కానీ, హిందీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అధికారికంగా వెల్లడించలేదు. సాహో కూడా సేమ్ ఇదే విధంగా వాయిదా పడతూ వచ్చింది. ఇప్పుడు సైరా కూడా పోస్ట్‌పోన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఏది నిజమో తేలాలంటే మాత్రం కొంచెం ఆగాల్సిందే మరి.

Latest Articles