Swathi Muthyam: ఆహాలో అదరగొడుతోన్న స్వాతిముత్యం.. 50 మిలియన్‌ల నిమషాలకుపైగా వ్యూస్‌తో..

|

Oct 30, 2022 | 7:40 PM

బెల్లం కొండ సురేశ్‌ రెండో తనయుడు సాయి గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం స్వాతిముత్యం. లక్ష్మణ్‌ కె కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. యూత్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం..

Swathi Muthyam: ఆహాలో అదరగొడుతోన్న స్వాతిముత్యం.. 50 మిలియన్‌ల నిమషాలకుపైగా వ్యూస్‌తో..
Swathi Muthyam Aha
Follow us on

బెల్లం కొండ సురేశ్‌ రెండో తనయుడు సాయి గణేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం స్వాతిముత్యం. లక్ష్మణ్‌ కె కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. యూత్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో కలెక్షన్ల విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్‌ మొదలైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆహాలో ఏకంగా 50 మిలియన్‌ వ్యూస్‌ మినిట్స్‌తో దూసుకుపోతోంది. సరోగసి విధానం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్‌ చేసింది. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నిజానికి దసరా సమయంలో భారీ చిత్రాలు విడుదలైన సమయంలో స్వాతిముద్రం రావడం కలెక్షన్లపై ప్రభావం చూపిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. పెళ్లి చేసుకుందామనుకున్న ఓ యువకుడి జీవితంలో ఎదురైన ఓ సంఘటన అతని లైఫ్‌ను ఎలాంటి మలుపులు తిప్పింది. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు, చివరికి ఆ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే సినిమా కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..