సుశాంత్​ కేసు: ఎన్​సీబీ అధికారికి కరోనా పాజిటివ్

|

Sep 16, 2020 | 6:05 PM

బాలీవుడ్​ హీరో సుశాంత్ అనుమానాస్పద​ మృతి కేసులో డ్రగ్స్​ కోణాన్ని విచారిస్తున్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారుల్లోని ఒకరికి కరోనా సోకింది.

సుశాంత్​ కేసు: ఎన్​సీబీ అధికారికి కరోనా పాజిటివ్
Follow us on

బాలీవుడ్​ హీరో సుశాంత్ అనుమానాస్పద​ మృతి కేసులో డ్రగ్స్​ కోణాన్ని విచారిస్తున్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారుల్లోని ఒకరికి కరోనా సోకింది. దీంతో బుధవారం విచారణను తొందరగా కంప్లీట్ చేశారు. విచారణలో భాగంగా సుశాంత్​ మాజీ మేనేజర్​ శ్రుతి మోదీని కేవలం గంటసేపు మాత్రమే ప్రశ్నించి పంపించేశారు. ఈ మేరకు ఎన్​సీబీ ప్రకటన విడుదల చేసింది.

“సుశాంత్​ కేసును డ్రగ్స్​ కోణంలో విచారిస్తున్న మా టీమ్ లోని ఓ సభ్యునికి కరోనా సోకింది. యాంటిజెన్​ పరీక్షలో ఈ విషయం నిర్దారణ అయ్యింది. మిగిలిన అధికారులకు పరీక్షలు చేయిస్తున్నాం. అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకోసమే ఈ రోజు విచారణకు హాజరైన శ్రుతి మోదీని తిరిగి పంపించేశాం” అని  ఎన్​సీబీ పేర్కొంది