Etharkkum Thunindhavan: యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ‘ఇతరుక్కుమ్ తునింధవన్’.. అదిరిపోయిన టీజర్

|

Feb 18, 2022 | 8:13 PM

హీరో సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూర్య కు ఆకాశం నీ హద్దు రా సినిమా మంచి విజయాన్ని అందించింది.

Etharkkum Thunindhavan: యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఇతరుక్కుమ్ తునింధవన్.. అదిరిపోయిన టీజర్
Etharkkum Thunindhavan
Follow us on

Etharkkum Thunindhavan: హీరో సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూర్య కు ఆకాశం నీ హద్దు రా సినిమా మంచి విజయాన్ని అందించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా జై భీమ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో.. ఆయన ఈటి అనే సినిమా చేస్తున్నారు. . పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో ‘ఇతరుక్కుమ్ తునింధవన్’ అనే టైటిల్ తో తెరకెక్కింది. తెలుగులో ఈటి అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమా ఉన్నాయని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాలో సూర్య విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్తున్నారు సూర్య. చాలా కాలం తర్వాత సూర్య తన వాయిస్ ను వినిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ను పూర్తి చేశారు సూర్య. ఈ సినిమాలో సత్యరాజ్.. శరణ్య .. రాజ్ కిరణ్.. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..