Suriya : వామ్మో.. హీరో సూర్యకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? క్రికెట్ స్టేడియంలో తండ్రితో కలిసి సందడి.. వీడియోస్ వైరల్..

తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోలలో సూర్య ఒకరు. గజినీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ చేయగా భారీ విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో అత్యధిక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పుడు వరుస చిత్రాలతో అలరిస్తున్నారు.

Suriya : వామ్మో.. హీరో సూర్యకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? క్రికెట్ స్టేడియంలో తండ్రితో కలిసి సందడి.. వీడియోస్ వైరల్..
Suriya

Updated on: Jan 22, 2026 | 7:27 AM

కోలీవుడ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కంగువ, రెట్రో చిత్రాలతో అలరించిన సూర్య.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కరుప్పు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈ హీరో చేతిలో సూర్య 46, 47 చిత్రాలు సైతం ఉన్నాయి. ఈ రెండు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ రెండు చిత్రాల అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా సూర్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఇదిలా ఉంటే.. సూర్య పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల సూర్య కూతురు ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందంలో అచ్చం తల్లిలాగే ఉందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సూర్య తనయుడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సూర్య కుమారుడు దేవ్ తాజాగా ISPL క్రికెట్ చూడటానికి వచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

తన తండ్రితో కలిసి స్టేడియంలో నడుస్తూ కనిపించారు. అహ్మదాబాద్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సింగమ్స్ తరపున ఆడిన సూర్య , ఆ మ్యాచ్‌లో తన తోటి సింగం అజయ్ దేవగన్‌ను కూడా కలిశారు. చెన్నై సింగం జెర్సీ ధరించి, దేవ్ తన తండ్రి సూర్యతో కలిసి నవ్వుతూ ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ కాగా.. సూర్యకు ఇంత పెద్ద తనయుడు ఉన్నాడా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. సూర్య కొడుకు దేవ్ వయసు ప్రస్తుతం 15 సంవత్సరాలు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara – Trisha : 40 ఏళ్ల వయసులో చెక్కు చెదరని సోయగం.. నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోస్ వైరల్..

ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..