Suresh Productions: సంగీత ప్రపంచంలోకి ‘సురేష్ ప్రొడక్షన్స్’.. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ పేరుతో.. లోగో ఆవిష్కరణ..

|

Jun 25, 2021 | 7:25 AM

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి.. భారతదేశపు పెద్ద చిత్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది సురేష్ ప్రొడక్షన్స్.

Suresh Productions: సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్.. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ పేరుతో.. లోగో ఆవిష్కరణ..
Suresh Production
Follow us on

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి.. భారతదేశపు పెద్ద చిత్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది సురేష్ ప్రొడక్షన్స్. నిర్మాత రామానాయుడు 1964లో ప్రారంభించిన సురేష్ ప్రొడక్షన్స్.. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించింది. ఎందరో నటీనటులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎస్పీ ప్రొడక్షన్స్. కేవలం తెలుగులోనే కాకుండా.. అన్ని ముఖ్య భాషల్లో చిత్రాలను తెరకెక్కించింది. కేవం నిర్మాణం మాత్రమే కాకుండా.. స్టూడియో.. పంపిణీ.. ల్యాబ్ ప్రదర్శన రంగాల్లో కూడా ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది.

దాదాపు 57 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్ని ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు ఈ సంస్థ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ పేరుతో కొత్త మ్యూజిక్ లేబుల్ ను ప్రారంభించి.. ఇకపై సంగీత ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఎస్పీ మ్యూజిక్ లోగోను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. మ్యూజిక్ మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాని ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ ఎస్పీ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్ ని తీసుకొస్తున్నాం. ఈ వేదిక మీద వినసోంపైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మంచి సంగీతానికి పవర్ హౌజ్ లా ఉంటుంది అన్నారు సురేష్ బాబు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో నారప్ప, విరాట పర్వం, దృశ్యం 2 లాంటి సినిమాలు నిర్మితమవుతున్నాయి.

Also Read: SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. అందుబాటులోకి కొత్త క్రెడిట్ కార్డ్స్.. అదిరిపోయే బెనిఫిట్స్.. వీరికి అనుగుణంగా..

Manish Raisinghan: నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని.. మాకు సిక్రెట్‏గా బిడ్డ జన్మించలేదు.. క్లారిటీ ఇచ్చిన అవికా స్నేహితుడు..

Ram Pothineni: ‘ఫైనల్ స్టోరీ కంప్లీట్ అయ్యింది.. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది’.. రామ్ పోతినేని ఆసక్తికర ట్వీట్..

Ram Gopal Varma: ప్యారేలాల్‌, సుబ్బారావ్‌, చింటూ.. పేర్లు పెట్టొచ్చుగా..? కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్