
సురేఖ వాణి.. ఈ మధ్యన సినిమాలు చేయకున్నా ఈ నటి పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరితో సురేఖ వాణి దిగిన ఫొటోలు తెగ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా కేపీ చౌదరితో దిగిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో డ్రగ్స్ కేసులో తల్లీ కూతుళ్లు ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే డ్రగ్స్ కేసుతో తమ కెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది సురేఖ వాణి. ఈ సంగతి పక్కన పెడితే సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు సురేఖవాణి, ఆమె కూతురు సుప్రిత. సూపర్‌హిట్ సినిమాల్లోని పాటలకు తమదైన శైలిలో డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారీ తల్లీ కూతుళ్లు. నెట్టింట ట్రోల్స్ వస్తున్నా వీరికి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక సుప్రియ కూడా తన ఫొటోషూట్స్, హాట్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో ‘సురేఖ వాణి కూతురు షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలోని ‘చెడుగుడంటే భయ్యం’ పాటలోని కొన్ని లిరిక్స్‌కు తనదైన శైలిలో స్టెప్పులేసింది సుప్రిత.పెద్దగా డ్యాన్స్ చేయకపోయినా లిరిక్స్‌కు తగ్గట్టుగా కళ్లు తిప్పుకోలేని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ‘తాడు బొంగరం, తళా తళా ఉంగరం, నెల్లూరు పొంగణం, మామిడాల సంబరం’ అనే లిరిక్స్‌కు సుప్రిత ఇచ్చిన హావభావాలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా తల్లి సురేఖ లాగానే సుప్రిత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..