Happy birthday Mahesh babu : సంచలనాలకు మారుపేరు ఈ సూపర్ స్టార్.. హ్యాపీ బర్త్ డే హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు..

|

Aug 09, 2021 | 10:12 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరులో మత్తు ఉంది అంటూ లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ ఉంటారు. మహేష్‌‌‌‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.

Happy birthday Mahesh babu : సంచలనాలకు మారుపేరు ఈ సూపర్ స్టార్.. హ్యాపీ బర్త్ డే హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు..
Mahesh
Follow us on

Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరులో మత్తు ఉంది అంటూ లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ ఉంటారు. మహేష్‌‌‌‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. టాలీవుడ్‌‌‌‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ ఒకరు. నట శేఖర కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. నేటితో 46వ పడిలోకి అడుగుపెడుతున్నారు మహేష్. మహేష్ పుట్టిన రోజును అభిమానులు సోషల్ మీడియాలో సంబరంగా జరుపుకుంటున్నారు. దర్శకేద్రుడు రాఘవేంద్రరావు మహేష్ బాబును హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌గా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు సూపర్ స్టార్. 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో విడుదలైన కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్‌‌‌‌‌తో కలిసి నటించాడు. అలాగే కృష్ణ నటించిన ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న- తమ్ముడు సినిమాల్లో నటించాడు మహేష్. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఆతర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన మహేష్ చదువు పై దృష్టి పెట్టారు. తిరిగి హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నటించిన యువరాజు, వంశీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినప్పటికీ మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నడు మహేష్ బాబు.  2001 లో విడుదలైన మురారి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌‌‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత టక్కరిదొంగ, బాబీ సినిమాలు విజయాన్ని అందుకోలేదు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 2003 అతి పెద్ద సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమా. అప్పటివరకు ఉన్న రికార్డులను ఒక్కడు సినిమా తిరగరాసింది. ఆ తర్వాత విడుదలైన నిజం సినిమా హిట్ టాక్ తెచుకోకపోయినప్పటికీ మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో మహేష్ నటనకుగాను నంది అవార్డు వరించింది. ఇక నాని, అర్జున్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాదించనప్పటికీ పర్లేదు అనిపించుకున్నాయి. ఇక ఆతర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. రికార్డ్‌‌‌‌లను తిరగరాయడంతోపాటు…ఇండస్ట్రీ హిట్‌‌‌గా నిలించింది ఈ సినిమా. ఆతర్వాత టాప్ హీరోగా కంటిన్యూ అవుతూ వస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే అతిథి , ఖలేజా, దూకుడు , బిజినెస్ మేన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , ఆగడు, శ్రీమంతుడు హర్ష, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను భరత్, మహర్షి , సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస సినిమాలతో అలరించారు మహేష్. ఇక ఇప్పుడు సర్కారు వారిపాట సినిమాతో మారోసారి బాక్సాఫీస్‌‌‌‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు సూపర్ స్టార్.  నేడు మహేష్ పుటిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ట్రీజర్ రికార్డ్స్‌‌‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 2022 జనవరి 13 సంక్రాంతికానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Bigg Boss 15 OTT launch Highlights: బాలీవుడ్‌లో మొదలైన బిగ్ బాస్ సందడి.. తొలివారం నామినేషన్ ఎవరంటే?