ఏ ఉడ్ అయితే ఏంటి? కొడితే దిమ్మతిరిగి పోవాలంతే అనే రేంజ్‌లో.. ప్రిన్స్ మహేష్(Mahesh Babu )చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ జంక్షన్‌లో ఫుల్ టైమ్ టాక్‌గా మారింది. తన బాలీవుడ్ ఎంట్రీతో పాటు పలు విషయాలపై ఆయన చేసిన కామెంట్స్ నేషన్ వైడ్‌గా సెన్సేషన్ అయ్యాయి. తెలుగు సినిమాలే నార్త్‌ను రూల్ చేస్తున్న ఈ టైమ్‌లో.. బాలీవుడ్ సినిమా చేయడం అంటే టైమ్ వేస్ట్ అన్నారు మహేష్. తనను హిందీ వాళ్లు భరించలేరని కూడా చెప్పారు. తెలుగు ప్రజల నుంచి అందుతున్న ఆదరణతోనే హ్యాపీగా ఉందన్నారు. ఇక్కడుండే స్టార్‌డమ్ చాలని, ఇంతకంటే అక్కడ ఏదో ఉంటుందనుకోవటం లేదని చెప్పారు. హిందీ సైడ్ నుంచి తనకు చాలా ఆఫర్స్ వస్తున్నాయని, కానీ… హిందీ వాళ్లు తనను భరించలేరని ఓపెన్‌గా చెప్పేశారు. పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలనే ఆలోచన లేదని తానెప్పుడూ అనలేదన్నారు. కాకపోతే హిందీ సినిమాలో నటించే ఉద్దేశం లేదని మాత్రమే చెప్పానన్నారు.
తెలుగు ఆడియన్స్ నుంచి దొరికే ప్రేమాభిమానాల ముందు మిగతావన్నీ దిగదుడుపే అనేది మహేష్ మాట. అందుకే.. తానెప్పుడూ తెలుగు ఇండస్ట్రీ వదిలి… వేరే భాషల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. బాలీవుడ్ సినిమాల కోసం టైమ్ వేస్ట్ చేసుకునే ప్రసక్తే లేదని తేల్చారు సూపర్‌స్టార్. సర్కారువారి పాట ప్రమోషన్లో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో మహేష్ చేసిన ఈ కామెంట్ బీటౌన్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది. అటు.. పాన్ ఇండియా సినిమా అంటే అర్థమే వేరంటూ కొత్త డెఫినిషన్ చెప్పారు. సో… తనకు హిందీ సినిమా చేసే ఉద్దేశం లేనేలేదని ఆవిధంగా తెగ్గొట్టేశారు. అయితే తనకు అన్ని బాషలపై గౌరవం ఉందన్నారు మహేష్. తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో ఆడుతున్నప్పుడు.. బాలీవుడ్‌లో ఎందుకు అనే ఉద్దేశంలోనే మహేష్ మాట్లాడినట్టు సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :