Mahesh Babu: సూపర్ స్టార్ సూపర్ స్టైలిష్ లుక్.. మహేష్ లేటెస్ట్ ఫోటో చూస్తే మతిపోవాల్సిందే

|

Aug 14, 2022 | 12:00 PM

రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్.

Mahesh Babu: సూపర్ స్టార్ సూపర్ స్టైలిష్ లుక్.. మహేష్ లేటెస్ట్ ఫోటో చూస్తే మతిపోవాల్సిందే
Mahesh Babu
Follow us on

రీసెంట్‌గా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu). ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు పుష్కర కాలం అయ్యింది గురూజీ మహేష్ కాంబినేషన్ లో సినిమా వచ్చి.. అతడు, ఖలేజా లాంటి సినిమాలతో మహేష్ లోని మరో యాంగిల్ చూపించిన త్రివిక్రమ్.ఇప్పుడు మరోసారి మహేష్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించనున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట సినిమాలో లాంగ్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్నారు. మొన్నామధ్య మహర్షి సినిమాలో గడ్డంతో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చారు. తాజాగా త్రివిక్రమ్ సినిమాలోనూ మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మహేష్ చేస్తున్న సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. రీసెంట్‌గా మహేష్ కూడా ఈ సినిమా పై స్పందిస్తూ.. నేను కానీ త్రివిక్రమ్ కానీ మునుపెన్నడూ ఇలాంటి కథ చేయలేదు అని హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో చాలా డిఫరెంట్ గా ఉంటుందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించనున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్, గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించారు మహేష్. తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రఫ్ లుక్‌లో మహేష్ నిజంగా చాలా స్టైలిష్‌గా ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్‌లో మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు మహేష్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి