Tollywood: దక్షిణాది సినిమాలు దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా సత్తాను చాటుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని సొంతం చేసుకుంటున్నాయి. గతంలో దక్షిణాది సినిమా స్టోరీలు నచ్చితే.. ఆ కథతో బాలీవుడ్ లో రీమేక్ చేసేవారు. కానీ బాహుబలి(Bahubali) సినిమా తర్వాత..టాలీవుడ్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. నార్త్ ఇండియాలో(North India) కూడా తమ సినిమాలతో సత్తా చాటుతూ.. అక్కడ వారి అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ పాన్ ఇండియా సినిమాను ఇప్పుడు కాదు.. 50 ఏళ్ల క్రితమే తెరకెక్కించారు.. టాలీవుడ్ సూపర్ హీరో.. అంతేకాదు.. అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను వసూలు చేశారు ఆ హీరో.. మరి 50 ఏళ్ల క్రితం తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఏది? ఎవరా హీరో తెలుసుకుందాం..
తేనెమనసులు సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గురించి నేటి తరానికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ.. మంచి నటుడు, నిర్మాత, దర్శకులు కూడా.. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేయని ప్రయోగం లేదు.. పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎమ్ ఎమ్ ఇలా అనేక రకాల జోనర్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇక సొంతం బ్యానర్ పద్మాలయ సమూవీస్ బ్యానర్ ను స్థాపించి.. అనేక సినిమాలను తెరకెక్కించారు. ఈ క్రమంలో సొంత బ్యానర్ లో కృష్ణ మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చేయడం కృష్ణ పట్టుదల కారణమని తెలుస్తోంది.
అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమా చేయడానికి ముందు.. కృష్ణ, నిర్మాత ఎమ్ ఎస్ రెడ్డితో ఇంగ్లీష్ సినిమా చూశారట.. అప్పుడు కృష్ణ.. ఆయనతో ఇలాంటి సినిమా మన తెలుగులో కూడా చేద్దామని కృష్ణ అడిగితే.. వెంటనే.. ఎం.ఎస్.రెడ్డి నవ్వి.. వెటకారంగా.. ఎందుకు ఉన్నవి అమ్ముకోవడానికా అంటూ అన్నారట.
అయితే కృష్ణకు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో తెరక్కించాలని మోసగాళ్ళకు మోసగాడు సినిమాను తన సొంత బ్యానర్లోనే తెరకెక్కించారు. ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు. కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించారు. తెలుగులోనే కాదు.. భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా 1971 ఆగస్టు 27న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాదు.. ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు తెరకెక్కించారు. ఇలా ఈ సినిమా 1971 ఆగస్టు 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. రిలీజైన ప్రతి భాషలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందుకే సూపర్ కృష్ణ.. 50 ఏళ్ళక్రితమే పాన్ ఇండియా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారని చెప్పవచ్చు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..