Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ సడన్‌గా అమెరికా వెళ్లారు. చాలా రోజులుగా రజనీ ఫారిన్ టూర్‌పై ప్రచారం జరుగుతున్నా… ఇంత సడన్‌గా వెళతారని ఎవరూ ఊహించలేదు. ఈ మధ్యే అన్నాత్తే షూటింగ్ పూర్తి చేసిన రజనీ.. జూలై ఎండ్‌లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హెల్త్ చెకప్ కోసం రెగ్యులర్‌గా ఫారిన్ వెళ్లొస్తుంటారు రజనీకాంత్. 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు తలైవా. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. రజనీ సిక్ అయ్యారన్న న్యూస్ కూడా అడపాదడపా వినిపిస్తూనే ఉంటుంది.
అవన్నీ ఒక ఎత్తైతే.. పాండమిక్ సిచ్యుయేషన్‌లో.. ఇంత సడన్‌గా రజనీ ఫారిన్ ఎందుకు వెళ్లారు. అది కూడా ఇంటర్‌నేషనల్ ట్రావెల్‌కు అనుమతి లేని సమయంలో స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరి వెళ్లాల్సినంత ఎమర్జెన్సీ ఏంటి..? ఈ విషయంలోనే అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ విషయంలో రజనీ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :