Kantara: ‘కాంతార’ బ్లాక్ బస్టర్ హిట్.. సూపర్ స్టార్ కు పాదాభివందనం చేసిన హీరో రిషబ్..

|

Oct 29, 2022 | 12:29 PM

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రివ్యూస్ వస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కాంతార చిత్రాన్ని వీక్షించారు.

Kantara: కాంతార బ్లాక్ బస్టర్ హిట్.. సూపర్ స్టార్ కు పాదాభివందనం చేసిన హీరో రిషబ్..
Rajinikanth, Rishab Shetty
Follow us on

కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడమే కాకుండా.. రిషబ్ స్క్రీన్ ప్లై, నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రివ్యూస్ వస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కాంతార చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఈ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా అభినందించారు. రజినీ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన రిషబ్ ను సన్మానించారు సూపర్ స్టార్. కాంతార చిత్రం తనకెంతో నచ్చిందని పేర్కొంటూ.. రిషబ్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వీరిద్దరు ఈ మూవీ విశేషాలపై ముచ్చటించారు.

ఈ విషయాన్ని రిషబ్ శెట్టి తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. సూపర్ స్టార్ కు ధన్యవాదాలు తెలిపారు. మీరు మమ్నల్ని ఒక్కసారి మెచ్చుకుంటే.. మాకు వందసార్లు అనిపిస్తుంది., ధన్యవాదాలు రజినీసర్. మా చిత్రం కాంతార ను అభినందించడం మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాము అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమా కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఉండే ఆదివాసీల సంప్రదాయ భూత కోల సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కించారు రిషబ్ శెట్టి.

ఇవి కూడా చదవండి

ఈ మూవీ హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఇందులో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.