Rajinikanth’s Annaatthe: దీపావళికే సూపర్ స్టార్ సినిమా.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే. ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Rajinikanths Annaatthe: దీపావళికే సూపర్ స్టార్ సినిమా.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్
Super Star Rajinikanth

Edited By: Janardhan Veluru

Updated on: Jul 02, 2021 | 1:03 PM

Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే. ఈ సినిమా కోసం రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల  చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా షూటింగ్ కు ఆలస్యం అవ్వడంతో సినిమా విడుదల పై రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా మొదలైన తర్వాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. దాంతో షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ సమయంలోనే రజినీకాంత్ అనారోగ్యానికి గురవ్వడం, దాంతో ఆయన రాజకీయాల్లోకి  రాకూడదని నిర్ణయించుకోవడం.. ఆతర్వాత దేశంలో కరోనా ఉధృతి పెరగడం.. ఇలా రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శివ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇక మొదటి నుంచి ఈ సినిమా పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ .. రజినీకాంత్ అన్నాత్తే సినిమా ను దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన విడుదల చేసారు. దర్శకుడు శివ గత సినిమాలు  మంచి విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు రికార్డ్ లను కూడా క్రియేట్ చేసాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మరి అన్నతే ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kangana Ranaut’s Thalaivi : ఆకట్టుకుంటున్న కంగనా ‘తలైవి’మూవీ స్టైల్.. నెట్టింట వైరల్

YS Jagan Biopic: సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోగా ఎవరో తెలుసా.?

Suman: దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలే… తెలుగు నటులంతా కలిసి ఉండాలి : సుమన్