Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు అరుదైన గౌరవం.. రజినీకాంత్‏తో కలిసి..

|

Oct 29, 2022 | 11:30 AM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‏తో కలిసి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు అరుదైన గౌరవం.. రజినీకాంత్‏తో కలిసి..
Rajinikanth, Ntr
Follow us on

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ లోకానికి దూరమైన నేటికి ఏడాది. అప్పు అకాల మరణాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించిన సంవత్సరం పూర్తైన నిత్యం అప్పు జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతున్నారు. తమ అభిమాన హీరోను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటీవల గణేష్ చతుర్థి వేడుకలలో భాగంగా వినాయకుడి విగ్రహంతోపాటు పూనీత్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వెండితెరపై పవర్ స్టార్‏గా తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఎంతో మంది అనాథలకు అండగా నిలిచారు అప్పు. కల్మషం లేని మనసు.. పేదవారికి అండగా నిలబడాలనే తాపత్రాయం .. కన్నడ ప్రజల మనసులో ఆయనకు చెరగని స్థానం సంపాదించిపెట్టింది. పునీత్ చేసిన సేవా కార్యక్రమాలకు.. ఆయన గొప్ప వ్యక్తిత్వానికి గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆయనను ‘కర్ణాటక రత్న’ అవార్డుతో గౌరవించింది.

నవంబర్ 1న ఈ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కుటుంబసభ్యులకు అందచేయనుంది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగుళూరులోని విధానసౌదలో ఈ వేడుకగా ఘనంగా నిర్వహించినున్నారు. ఈ వేడకకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రభుత్వమే స్వయంగా పరిశీలిస్తుంది. ఈ వేడకకు ముఖ్య అతిథులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకానున్నారు. వీరిద్దరికి కర్ణాటక ప్రభుత్వం స్వయంగా ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వీరు ఇరువురు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

అప్పుకు కన్నడలోనే కాకుండా మిగతా భాషల నటీనటులతో మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా తారక్ తో అప్పుకు మధ్య స్నేహం మరింత ప్రత్యేకం. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలోని గెలెయా.. పల్యా పాటను తారక్ ఆలపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలను పునీత్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.