Mahesh Babu: బిల్ గేట్స్‎ను కలిసిన సూపర్ స్టార్ దంపతులు.. నెట్టింట ఫోటో వైరల్..

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి విదేశాల్లో సందడి చేస్తున్నాడు.

Mahesh Babu: బిల్ గేట్స్‎ను కలిసిన సూపర్ స్టార్ దంపతులు.. నెట్టింట ఫోటో వైరల్..
Mahesh Babu Bill Gates

Updated on: Jun 29, 2022 | 2:27 PM

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu). డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా.. భారీగానే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి విదేశాల్లో సందడి చేస్తున్నాడు.. గత కొన్ని రోజులుగా మహేష్ ఫ్యామిలీ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా సూపర్ స్టార్ దంపతులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు.

న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను మహేష్ బాబు… ఆయన సతీమణి నమ్రత కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. బిల్ గేట్స్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయనొకరు.. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఆయన ఒక స్పూర్తి అంటూ కామెంట్ చేశారు మహేష్.. ఇక ఇండియాకు వచ్చిన తర్వాత మహేష్… తన తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ నటించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.