AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు పెద్ద హీరోయిన్.. ఆమె పేరే ఓ వైబ్రేషన్

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది.

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు పెద్ద హీరోయిన్.. ఆమె పేరే ఓ వైబ్రేషన్
Heroine Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2024 | 2:05 PM

Share

ఇప్పటికే ఎంతమంది నటీమణుల్ని స్టార్స్‌గా తయారు చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఇతర భాషల్లో ఎవరైనా అందగా ఉండి.. బాగా నటిస్తున్నారని తెలిస్తే చాలు.. వెంటనే మనవాళ్లు అక్కడ వాలిపోతారు. తెలుగు ఇండస్ట్రీని ఎక్కువగా ఏలుతున్నది.. ముంబై బ్యూటీలు మలయాళ ముద్దుగుమ్మలు, కన్నడ కస్తూరీలే కదా. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. అందుకే హాలివుడ్ నుంచి కూడా హీరోయిన్స్‌ను ఇక్కడకు రప్పిస్తున్నాను. కాగా పైన ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు పెద్ద హీరోయిన్. ఆమెది మన దేశం కాదు కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈమెకు కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ అంతా.. ఇంతా కాదు. పాన్ ఇండియా స్టార్‌గా అదరగొడుతోంది. ఆమె ఎవరో మేమే చెప్పేస్తాం లెండి. పాన్ ఇండియా నటి ‘సన్నీ లియోన్’. ఈమె గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో అనేది నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసి సన్నీ చిన్నప్పుడు చాలా క్యూట్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఆమె గతంలో అడల్ట్ ఫిల్మ్స్‌లో నటించిన విషయం పక్కనబెడితే.. ఆమె మనసు వెన్న. ఓ అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురిలా సాకుతోంది. పలు రకాల సోషల్ సర్వీసులు కూడా చేస్తోంది. కరోనా సమయంలో చాలామంది ఆకలిని తీర్చింది ఆమె. సన్నీ.. తెలుగులో కరెంట్ తీగ, PSV గరుడ వేగ, జిన్నా సినిమాల్లో యాక్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.