Actor Darshan: రేణుకాస్వామి బాడీ మయం చేసేందుకు 30 లక్షల డీల్.. నిజాలు ఒప్పుకున్న దర్శన్..
తనను క్షమించాలని రేణుకాస్వామి కాళ్లపై పడి ప్రాధేయపడినా పవిత్ర కనికరించలేదు. బూటుకాలితో తన్నుతూ అతడిపై మళ్లీ దాడి చేసింది పవిత్ర. ఆరోజు ఆమె వేసుకున్న షూస్, డ్రెస్సులు స్వాధీనం చేసుకున్న పోలీసులు...ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో దర్శన్‌తో సహా 9 మందిని బుధవారం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లి DNA టెస్ట్‌లు చేశారు.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. లేటెస్ట్‌గా మరో విషయం వెలుగులోకి వచ్చింది. డెడ్‌బాడీ మాయం చేసేందుకు 30 లక్షల రూపాయలు దర్శన్ ఇచ్చినట్టు విచారణలో తేలింది. దర్శన్ ఈ నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని నిందితులను కోరినట్లు దర్శన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. చిత్రదుర్గం నుంచి రేణుకాస్వామిని బెంగళూరులోని షెడ్డుకు తరలించిన వెంటనే పవిత్రగౌడ అక్కడికి చేరుకుంది. తనకు అసభ్యకరంగా సందేశాలు పంపించాడనే కోపంతో అతడిపై దాడికి దిగింది. విచక్షణరహితంగా అతడిని చావబాదింది. తనను క్షమించాలని రేణుకాస్వామి కాళ్లపై పడి ప్రాధేయపడినా పవిత్ర కనికరించలేదు. బూటుకాలితో తన్నుతూ అతడిపై మళ్లీ దాడి చేసింది పవిత్ర. ఆరోజు ఆమె వేసుకున్న షూస్, డ్రెస్సులు స్వాధీనం చేసుకున్న పోలీసులు…ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో దర్శన్‌తో సహా 9 మందిని బుధవారం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లి DNA టెస్ట్‌లు చేశారు.
దాడి టైంలో రేణుకాస్వామి మెడలోని బంగారు గొలుసును ఓ నిందితుడు కొట్టేసినట్టు తెలుస్తోంది. నిందితులకు చెందిన పది సెల్‌ఫోన్లలో డేటా రీకవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు.. దర్శన్నురక్షించేందుకు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ వచ్చిన వార్తలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఇదిలా ఉంటే దర్శన్ తోపాటు పవిత్రగౌడ, 17 మంది నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో పోలీసులు నిందితులను ఈరోజు బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచనున్నారు.ఈ కేసుకు సంబంధించి దర్శన్, అతని బృందాన్ని ఇప్పటికే రెండుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిందితులు తమను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని పోలీసులను కోరే అవకాశం ఉంది. 2011లో భార్య విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో దర్శన్ జైలు పాలయ్యాడు. దర్శన్ 14 రోజుల పాటు సెంట్రల్ జైలులో ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
