AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: రవితేజ పై అలాంటి కామెంట్ చేసిన నెటిజన్.. గట్టిగా ఇచ్చిపడేసిన హరీష్ శంకర్

ఓ వైపు బడా హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. చిన్న హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పైనే కన్నేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం హిట్ కొట్టడానికి చాలా అవస్థలు పడుతున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన క్రాక్ సినిమా తర్వాత రవితేజ మళ్లీ హిట్ అందుకోలేదు.

Ravi Teja: రవితేజ పై అలాంటి కామెంట్ చేసిన నెటిజన్.. గట్టిగా ఇచ్చిపడేసిన హరీష్ శంకర్
Raviteja
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2024 | 4:45 PM

Share

మాస్ మహారాజ రవితేజ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికి సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు రవితేజ. కానీ మనోడు మాత్రం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలో.. ఓ వైపు బడా హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. చిన్న హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పైనే కన్నేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం హిట్ కొట్టడానికి చాలా అవస్థలు పడుతున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన క్రాక్ సినిమా తర్వాత రవితేజ మళ్లీ హిట్ అందుకోలేదు. కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఎవరూ మాస్ రాజాకు హిట్ ఇవ్వలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్స్ పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ పెద్ద హీరో.. సరైన కథ పడితే వందకోట్లు వసూల్ చేసే స్టామినా ఉన్న హీరో రవితేజ. ఏ డైరెక్టరైనా రవితేజతో ఆలాంటి సినిమా చేస్తారా.. అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఓ నెటిజన్  రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ పై షాకింగ్ కామెంటే చేశాడు. దాంతో దర్శకుడు హరీష్ శంకర్ అతని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

హరీష్ శంకర్ రవితేజకు పెద్ద అభిమాని అందరికి తెలుసు.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి షో రీల్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. అలాగే కొంతంమంది మాత్రం ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ” రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ కన్నా ఆ సినిమాల్లో హీరోయిన్‌ సెలక్షన్ చాలా బాగుంటుంది” అని కామెంట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ రిప్లే ఇస్తూ..  మీ ప్రొఫైల్‌లో మీరు తెలుగు భాషకు చివరి నుంచి రెండో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటి మీరు ఇంకా రిలీజ్ కానీ సినిమా స్క్రిప్ట్‌ గురించి మాట్లాడటం చాలా కామెడీగా ఉంది. ఇది ముందే తెలిసి ఉంటే మీకు నా సినిమాలో కమెడియన్ ఛాన్స్ ఇచ్చేవాడిని. అయినా పర్వాలేదు.. మీరు మమ్మల్ని బాగానే నవ్విస్తున్నారు.. ఇలాగే కంటిన్యూ అవ్వండి. మీ నుంచి ఇలాంటి కామెడీని ఇంకా ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా” అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.