AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil: సూపర్ స్టార్ కోసం మరోసారి విలన్‌గా మారిన సునీల్.. జైలర్ నుంచి నయా పోస్టర్

ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే నెల్సన్ దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Sunil: సూపర్ స్టార్ కోసం మరోసారి విలన్‌గా మారిన సునీల్.. జైలర్ నుంచి నయా పోస్టర్
Jailar
Rajeev Rayala
|

Updated on: Jan 18, 2023 | 3:02 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జైలర్. రజినీకాంత్ చివరిగా నటించిన అన్నత్తే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. దాంతో ఇప్పుడు జైలర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే నెల్సన్ దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నెల్సన్ కూడా ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీదఉన్నరు. ఈ క్రమంలోనే తలైవా సినిమాను పవర్ ఫుల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ జైలర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్ .

ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కనిపించనున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రతో మెప్పించారు సునీల్.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. మరి ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎలా ఉండబోతుందన్నది తెలియాల్సి ఉంది. ఇక సునీల్ సూపర్ స్టార్ కు పెద్ద ఫ్యాన్. ఈ విషయాన్నీ గతంలో ఆయన చాలా సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆయన సినిమాలోనే నటించే ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాలో సునీల్ ఎలా మెప్పిస్తారో చూడాలి.

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?