వారం నుంచి కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ నగరం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా వరద తీవ్రత ఎక్కువగ ఉండడంతో అవి చాలడం లేదు. దీంతో చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం, నీళ్లు, పాలు.. తదితర అత్యవసర వస్తువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో పాటు పలు NGO సంస్థలు, పలువురు ప్రముఖులు వారికి ఫుడ్, వాటర్.. లాంటివి అందిస్తున్నారు. ఈ కష్టకాలంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. తన టీమ్ ను విజయవాడకు పంపించారు. అక్కడ వరద ముంపునకు గురయిన ప్రాంతాల్లోని ప్రజలకు ఫుడ్, వాటర్ అందిస్తున్నారు. ప్రముఖ IAS ఆఫీసర్ లక్ష్మీశ కూడా సందీప్ కిషన్ టీం చేస్తున్న పనులను చూసి ప్రశంసలు కురిపించారు. మరికొందరు యువత ఇలాగే ముందుకు వస్తే విజయవాడ త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సందీప్ కిషన్ , అతని టీమ్ ను అభినందిస్తున్నారు.
కాగా కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకుస్పందించిన అతను వెంటనే డబ్బును సదరు మహిళ కు పంపించాడు.
Kuddos to @sundeepkishan anna Team👏🏻
Truly a Great initiative towards everyone…❤️#SundeepKishan #APFloods pic.twitter.com/RWYrkc5ArT
— Anchor_Karthik (@Karthikk_7) September 3, 2024
ఇక తాను నిర్వహిస్తోన్నవివాహ భోజనంబు రెస్టారెంట్స్ నుంచి ప్రతి రోజు దాదాపు 300 మందికి అవసరం ఉన్న వారికి ఫుడ్ ఫ్రీగా సర్వ్ చేస్తున్నాడీ రియల్ హీరో. ముఖ్యంగా అనాథశ్రమాలు, రోడ్ సైడ్ ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నాడు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపాడీ ట్యాలెంటెడ్ యాక్టర్
Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt
— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.