Jayamma Panchayathi: పంచాయితీ పెద్దగా మారిన సుమ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ

Jayamma Panchayathi: పంచాయితీ పెద్దగా మారిన సుమ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
Suma

Updated on: Nov 06, 2021 | 3:12 PM

Suma Kanakala: స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ. అయితే సుమ గతంలో సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా అలరించడానికి సిద్ధమయ్యారు ఈ యాంకరమ్మ. సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు జయమ్మ పంచాయితీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

”సుమ గారూ..  ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఇష్టపడే పేరు. ఇప్పుడు 70ఎంఎం  స్క్రీన్ పైకి వచ్చేస్తున్నారు.  చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చరణ్ ట్వీట్ లో రాసుకొచ్చారు. సినిమాకి విజయ్ కుమార్ కలివరపు కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..

Priyanka Chopra: లాస్ ఏంజెల్స్‏లో భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న గ్లోబల్ స్టార్.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..

Mega 154: మెగా 154వ ప్రాజెక్ట్ నుంచి మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం అంటున్న అభిమానులు.