AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: వాంటెడ్ పండుగాడ్ గా వస్తున్న సుడిగాలి సుధీర్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

బుల్లితెరపై యాంకర్ గా ప్రముఖ టీవీ షోలో కమెడియన్ గా చేస్తూనే హీరోగా అవకాశాలు అందుకుంటున్నాడు సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer: వాంటెడ్ పండుగాడ్ గా వస్తున్న సుడిగాలి సుధీర్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Sudigali Sudheer
Rajeev Rayala
|

Updated on: May 20, 2022 | 6:45 AM

Share

బుల్లితెరపై యాంకర్ గా ప్రముఖ టీవీ షోలో కమెడియన్ గా చేస్తూనే హీరోగా అవకాశాలు అందుకుంటున్నాడు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer). క్రమ క్రమంగా తన క్రేజ్ ను పెంచుకుంటూ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెరకెక్కుతున్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్.  శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతుంది.  ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం చిత్ర యూనిట్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘సుడిగాలి సుధీర్ బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. రీసెంట్ టైమ్‌లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు సుధీర్‌. ఆయ‌న వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‘వాంటెడ్ పండుగాడ్’లో సుధీర్ న‌ట‌న అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..

Follow Us
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!