నటనలో ట్యాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేని హీరో ఎవరంటే సుధీర్ బాబు అని చెప్పుకోవచ్చు. సినిమాల కోసం ఎందాకైనా కష్టపడతాడు. సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచుకుంటాడు అదే అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్ లా లావుగా మారిపోతాడు. కానీ ఈ ట్యాలెంటెడ్ హీరోకు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. గతేడాది రిలీజైన హంట్, మామా మశ్చీంద్ర సినిమాలే సినిమాపై సుధీర్ బాబు నిబద్ధతకు ఉన్న ప్రత్యక్ష నిదర్శనం. నటనా పరంగా సుధీర్ బాబకు మంచి పేరొచ్చినా కమర్షియల్ ఈ సినిమాలు సక్సెస్ అవ్వలేదు. అందుకే ఈసారి ‘హరోం హర’ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్, జయప్రకాశ్, అక్షర, అర్జున గౌడ, లక్ష్మణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న హరోంహర సినిమా శుక్రవారం (జూన్ 14)న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ‘హరోం హర’ మూవీ టీమ్ ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. హరోం హర సినిమాకు రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది మూవీ టీమ్.
ప్రముఖ ఆన్‍లైన్ టికెంట్ బుకింగ్ ప్లాట్‍ఫామ్ ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా బుక్ మై షోలో ఈ బంపరాఫర్ పొందవచ్చు. బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్ల ధరకే మూడు వస్తాయని హరోంహర టీమ్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ అభిమానులను థ్రిల్ కు గురి చేశాయి. పైగా ఈ వారం ఇదొక్కటే కాస్త క్రేజ్ ఉన్న సినిమా. మరెందుకు లేటు.. రెండు టికెట్లతో ముగ్గురు కలిసి హరోం హర సినిమాను ఎంజాయ్ చేయండి.
Buy 2 tickets and get One free for #HaromHara on Book My Show. pic.twitter.com/huehLMBQgX
— Suresh PRO (@SureshPRO_) June 13, 2024
Win with #HaromHara ❤️🔥
Buy a ticket for the film and get a chance to win Subramanyam’s Jeep and an iPhone🎁💥
WhatsApp your ticket to 9989707521
WORLDWIDE GRAND RELEASE TOMORROW😎
Book your tickets now! 🎟️
— https://t.co/TuQqUhDycI@Isudheerbabu @ImMalvikaSharma pic.twitter.com/ljrPRN4Zwx— Sree Subrahmanyeshwara Cinemas (@SSCoffl) June 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.