Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్నయంగ్ హీరో సుధీర్ బాబు..

| Edited By: Rajitha Chanti

Apr 21, 2021 | 7:04 AM

యంగ్ హీరో  సుధీర్ బాబు జోరు పెంచారు. ఇటీవలే 'పలాస' దర్శకుడు కరుణ కుమార్‌తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను అనౌన్స్ చేసిన సధీర్..తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు.

Sudheer Babu: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటున్నయంగ్ హీరో సుధీర్ బాబు..
Follow us on

Sudheer Babu: యంగ్ హీరో  సుధీర్ బాబు జోరు పెంచారు. ఇటీవలే ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను అనౌన్స్ చేసిన సధీర్..తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో మరో సినిమా చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రాన్ని దీపావళి కానుకగా అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ”సమ్మోహనం, V” సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే

సుధీర్ బాబు కోసం డిఫరెంట్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నారట. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రం రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ లో నటించిన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది.  ఇక ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే  ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇంద్రగంటి టైటిల్ ను ప్రకటించగానే యూత్ లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో సుధీర్ బాబు .. సినిమా డైరెక్టర్ పాత్రలో కనిస్తాడట. అనుకోని సమస్య లో చికుక్కున దర్శకుడగా సుధీర్ బాబు కనిపించనున్నాడట. అయితే ఆ సమస్యలనుంచి ఓ అమ్మాయి అతడిని బయట పడేస్తుందట. ఆ అమ్మాయి ఈ చిక్కుల్లో పడ్డ దర్శకుడిని ఎలా బయటపడేసింది అనేది సినిమా కథ అని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాను లైన్ లో పెట్టిన ఆది సాయికుమార్..

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలకు తప్పని కరోనా కష్టాలు… షూటింగ్స్ పై కోవిడ్ ఎఫెక్ట్..

Keerthy Suresh: రేసులో వెనకబడ్డ అందాల భామ.. మహేష్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మహానటి

Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..