టీవీ సీరియల్స్ లు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో రకాల సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. లేడీస్ మాత్రమే కాదు ఇప్పుడు మగాళ్లు కూడా ఈ సీరియల్స్ కు అలవాటు పడుతున్నారు. అంతలా ఆకట్టుకుంటున్నాయి సీరియల్స్. ఇలా ప్రేక్షకులను మెప్పించేందుకు ఇప్పుడు మరో సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమాన ప్రేక్షకులకు ప్రముఖ ఛానెల్ స్టార్ మా అందిస్తున్న సరికొత్త కథా కథనాల వినూత్న ధారావాహిక “నిన్ను కోరి”.
విదేశీ పెళ్లికొడుకుల పైన కలలు; అక్కడి అబ్బాయిల పెళ్లి సంబంధాల గురించి అపోహలు; అసలు నిజాలు, దాచిపెట్టిన వాస్తవాలు తెలిసిన తరవాత తలకిందులవుతున్న అమ్మాయిల జీవితాలు – ఈ సరికొత్త కథకి మూల స్తంభాలు. తెల్లారి లేచింది మొదలు టీవీలో, న్యూస్ పేపర్స్ లో ఇలాంటి విషయాలు వింటూనే వున్నాం, చూస్తూనే వున్నాం. అలాంటి సున్నితమైన భావోద్వేగాల కథ “నిన్ను కోరి”. పరువు ప్రతిష్ట, కుటుంబ గౌరవం కోసం ఎంతో తపన పడే ఒక పల్లెటూరి పెద్ద ఇంట్లో జరిగే సంఘటనల సమాహారం ఈ కథ. ఏ పాత్ర ఏ సందర్భంలో ఎలా స్పందిస్తుందో, ఏ క్యారెక్టర్ ఎంత ధైర్యంగా నిలబడుతుందో.. ఏ క్యారెక్టర్ ఎలాంటి కన్విక్షన్ తో ఉంటుందో.. స్పష్టంగా ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పష్టమైన పంథా ఉంటుంది.
అలాగే సందర్భాలు కూడా నిజజీవితం నుంచి వచ్చినవే. ఒక అమ్మాయి జీవితం గురించి, పెళ్లి గురించి ఎలా ఆలోచించాలి, ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాల్ని పరిగణన లోకి తీసుకోవాలి, బయటి ప్రపంచాన్ని ఎంత వరకు లెక్కలోకి తీసుకోవాలి.. లాంటి ఎన్నో విషయాలు ఈ కథలో అంతర్భాగంగా ఉండడం ఈ కథ ప్రత్యేకత. జూన్ 3 నుంచి.. మధ్యాహ్నం 12. 30 గంటలకు స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. తప్పక చూడండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.