స్టార్ హీరో గొప్పమనసు.. చిన్న పిల్లల వైద్యం కోసం కీలక నిర్ణయం
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఎంతో మంది చారిటీల ద్వారా పేదప్రజలకు, చిన్న పిల్లలకు సాయం అందిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో తన పుట్టిన రోజు సందర్భంగా చిన్నారుల కోసం పెద్ద సాయమే చేశారు. గొప్పమనసు చాటుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోలు పలు ఛారిటీల ద్వారా ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటారు. హీరోలే కాదు వారి ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు కొన్ని సేవాకార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరో తన పుట్టిన రోజు చిన్న పిల్లల కోసం గొప్ప సాయం చేశాడు. హీరో గొప్పమనసు కు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరు.? ఆయన చేసిన గొప్ప సాయం ఏంటో చూద్దాం.. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారిలో మోహన్ లాల్ ఒకరు.
రీసెంట్ గానే మోహన్ లాల్ తుడరుమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సహాయక పాత్రలు కూడా చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తన 65వ జన్మదినం సందర్భంగా, విశ్వసంతి ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు బేబీ మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి సబ్సిడీ రేట్లలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను అందించనున్నారు.
చిన్న పిల్లలుకు పిల్లలకు తక్కువ ఖర్చుతో చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు “బీ ఎ హీరో” అనే ఏడాది పొడవునా నడిచే యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. ఇంకా, గతంలో కూడా మోహన్‌లాల్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024లో వయనాడ్ విపత్తు బాధితుల పునరావాసం కోసం రూ.3 కోట్ల విరాళం అందించారు అలాగే యు రెస్క్యూ ఆపరేషన్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న పిల్లల కోసం మోహన్ లాల్ సాయం చేయడం పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
Viswasanthi Foundation, in association with Baby Memorial Hospital, is undertaking a noble initiative. We are providing liver transplantations for deserving children from economically weaker sections of society at a significantly lower expense. Many children in Kerala with liver… pic.twitter.com/7wWQFg9eHE
— Mohanlal (@Mohanlal) May 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి



