- Telugu News Photo Gallery Cinema photos Urvashi Rautela in a different look at the Cannes Film Festival
వారెవ్వా..నిషిలో వెన్నెలలా ఊర్వశీ..అచ్చం అప్సరే!
గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిఫరెంట్ లుక్‌లో తన స్టైలిష్ డ్రెస్‌తో ఆకట్టుకుంది.
Updated on: May 23, 2025 | 11:31 AM

అందాల తార ఊర్వశి రౌటెలా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కళ్లు చెదిరే అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన చూపు, బ్యూటీతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్2గా ఊర్వశి రౌటెలా తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. కాగా, ఆ ఫోటోస్ పై ఓ లుక్కేద్దాం రాండి.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ ముద్దుగుమ్మ ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు నార్త్‌లో స్పెషల్ సాంగ్స్‌లో చిందులేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటుంది.

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడే అంటూ ఐటమ్ సాంగ్ చేసి, తన అంద చందాలతో కుర్రకారును మాయ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ, వీలున్నప్పుడాల్ల వెకేషన్స్‌కు వెళ్తూ, వరస ఫొటో షూట్‌తొ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఎంబ్రాయిడరీ డిజైన్‌తో తయారు చేసిన బాడీ కాన్ డ్రెస్ ధరించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టైలిష్ లుక్‌లో మెరిచింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



