పువ్వుల్లో అందమైన నవ్వుతో బుట్ట బొమ్మ..క్యూట్ పిక్స్ వైరల్
బుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ బ్యూటీ తాజాగా పూలతోటల్లో విహరిస్తూ తన క్యూట్ స్మైల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.పువ్వుల్లో తాను ఓ అందమైన పువ్వులా తన బోసి నవ్వులతో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 23, 2025 | 11:32 AM

అందాల బ్యూటీ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. మొదట్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయినా, ఈ అమ్మడుకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.

తెలుగు, కన్నడ,తమిళ, హిందీలో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకప్పుడు ఈ అమ్మడు మరో సినిమా సైన్ చేయడానికి డేట్సే కుదరకపోయేవి కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి ఆఫర్స్ చాలా తగ్గాయి. చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరమైంది ఈ అమ్మడు.

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది.ఒక లైలా సినిమా తర్వాత ఈ బ్యూటీ ముకుంద సినిమా లో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్. మహేష్ బాబు, రామ్ చరణ్చ ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

వరస సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ టాలీవుడ్ ను షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.దీంతో తమిళం, హిందీ వైపు కన్నేసి, అక్కడ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన రెట్రో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ తన అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా పూలతోటల్లో ఆనందంగా విహరిస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



