Ashok Galla’s Hero : రాజమౌళి వదిలిన మహేష్ మేనల్లుడి మూవీ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న ‘హీరో’ ట్రైలర్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హీరో సినిమాతో అశోక్ హీరోగా పరిచయం కానున్నాడు.

Ashok Gallas Hero : రాజమౌళి వదిలిన మహేష్ మేనల్లుడి మూవీ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న హీరో ట్రైలర్
Hero

Updated on: Jan 10, 2022 | 5:50 PM

Ashok Galla’s Hero : మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హీరో సినిమాతో అశోక్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

ఇటీవలే హీరో మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. నేడు తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ కి భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యం తో కన్నుమూయడంతో  ప్రీరిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి హీరో మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదిక గా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే చిన్న తనం నుంచి హీరో అవ్వాలనే పట్టుదలతో హీరో ఉంటాడని అర్ధమవుతుంది. కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదు రా.. అంటూ నరేష్ హీరోను తిడుతూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. సినిమాలో కావలసినంత ఎంటర్టైనమెంట్ ఉందని అర్ధమవుతుంది. అలాగే ఊహించని ట్వీట్స్ కూడా ఉండనున్నాయని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..