
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న తమన్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అలాగే తన ఫాలోవర్ల పోస్టులకు రిప్లై ఇస్తుంటారు. అయితే తాజాగా తమన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రావణ్ మిశ్రా అతుల్ మిశ్రా అనబడే ఇద్దరు పండితులతో తమన్ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్ ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అఖండ సినిమాకు తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. సినిమా హిట్ అవ్వడానికి తమన్ సంగీతం అంతో ప్లస్ అయ్యింది. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాకు అంతకు మించి సంగీతం అందించనున్నారు తమన్.. ఇప్పటికే అఖండ 2 సినిమా పనులు మొదలు పెట్టాడు తమన్.. ఇక ఇప్పుడు ఇద్దరు పండితులతో తమన్ ఫోటో వైరల్ కావడంతో.. అఖండ 2కోసమే ఆ పండితులను తమన్ రంగంలోకి దింపారని అంటున్నారు నెటిజన్స్.
ఆ ఇద్దరు పండితులు గుక్కతిప్పుకోకుండా.. మంత్రోచ్చారణ చేయగలరు.. అలాగే శ్లోకాలు ఆలపించగలరు.వీరికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ కోసం తమన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్స్.. థియేటర్స్ తగలబడిపోతాయి.. స్పీకర్లు పగిలిపోతాయి అని అంటున్నారు నెటిజన్స్.. మరి తమన్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇటీవలే [అవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తమన్ అదిరిపోయే సంగీతం అందించారు. ఓజీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.
#Akhanda2
Pandit Duo Shravan Misra and atul Misra వస్తే ఇలా ఉంటుంది. #Thaman మంచి ఎంపిక 👌 https://t.co/ZJmzROd6Sd pic.twitter.com/UgkUe5RhRV— BIG TV Cinema (@BigtvCinema) October 12, 2025