సాధారణంగా ఎవరైనా కొత్త ఇల్లు కొన్నా, కట్టించినా లేటెస్ట్ అండ్ వెస్టర్న్ డిజైన్స్‌తో గోడలను నింపేస్తారు. ఇంటి అందాన్ని అవి మరింత పెంచుతాయని వారి అభిప్రాయం కావొచ్చు. అయితే ఈ ప్రపంచంలో అమ్మకు మించిన అందమేముంది? అనుకున్నాడు బిగ్‌బాస్ 3 విన్నర్, ప్రముఖ ప్లేబ్లాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. అందుకే తన ఇంటి గోడలను కూడా తన తల్లికి ఇష్టమైన ఫొటోలతో అందంగా అలంకరించాడు. దీనికి సొంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి రాహుల్ ఇంటికి వెళ్లారు. అక్కడ తన తల్లి ఫొటోలతో నింపేసిన గోడలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న బిగ్‌బాస్ విన్నర్‌ను మనసారా అభినందించారు. కాగా ఈ సందర్భంగా రాజమౌళి ఫ్యామిలీతో కలిసి ఒక ఫొటో కూడా దిగాడు రాహుల్. బ్యాక్‌గ్రౌండ్‌లో తన తల్లి ఫొటోలతో నింపిన వాల్స్ కనిపించేలా దిగిన ఈ ఫొటోకు’బెస్ట్ ఫొటో ఎవర్’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
కాగా బిగ్‌బాస్‌కు ముందు రాహుల్ సిప్లిగంజ్ అంటే చాలా కొద్దిమందికే తెలుసు. ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రైవేట్ ఆల్బమ్స్ మాత్రమే చేసేవాడు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి టైటిల్ గెలిచాడో తెలుగు నాట అతనికి అభిమానులు పెరిగిపోయారు. హౌస్లో ఉన్నప్పుడే కొత్త ఇంటిని కొనాలన్న కోరికను బయటపెట్టిన రాహుల్ అనుకున్నట్లే లగ్జరీ సదుపాయాలతో కూడిన కొత్త ఇంటిని కొన్నాడు. కారు కూడా కొనేశాడు. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక భాగం. సంగీతాభిమానుల మన్ననలతో పాటు ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న నాటునాటు సాంగ్‌ను ఆలపించిన సింగర్లలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకరు. కీరవాణి సంగీత దర్శకత్వంలో కాలభైరవతో కలిసి ఈ పాటను అద్భుతంగ ఆలపించాడు రాహుల్. అన్నట్లు సింగర్ గానే కాకుండా నటుడిగా అప్పుడప్పుడు తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు రాహుల్. ఇప్పటికే కొన్ని సినిమాల్లో మెరిసిన అతను కృష్ణవంశీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగమార్తాండలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..