S. S. Rajamouli : రిలీజ్ డేట్స్ మారడంతో రెండో విడత ప్రమోషన్ల బెడద తప్పడం లేదు పెద్ద సినిమాలకు. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అయితే మళ్లీమళ్లీ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రమోషనల్ కంటెంట్ విషయం దగ్గరే తిప్పలు పడాల్సి వస్తోంది. భీమ్లానాయక్, రాధేశ్యామ్ దర్శక నిర్మాతలైతే సెకండ్ ట్రయిలర్‌ని విడుదల చేసి సెకండ్ ఫేజ్ ప్రమోషన్‌ని గ్రాండ్‌గా షురూ చేసుకున్నాయి. ట్రిపులార్ విషయంలో మాత్రం ఇంటిలిజెంట్‌గా ఆలోచించి ఆ ఐడియాను పూర్తిగా పక్కకు పెట్టేశారు.
భీమ్లానాయక్ అండ్ రాధేశ్యామ్.. రెండు సినిమాల నుంచి విడుదలైన ఫస్ట్ ట్రయిలర్స్‌కి పేలవమైన రెస్పాన్స్ వచ్చింది. కట్ షాట్స్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాకా అన్ని సెక్షన్స్‌లోనూ డల్ రిపోర్ట్ వచ్చింది. అందుకే.. రెండోవిడత ప్రచారం మొదలయ్యే ముందు రిలీజ్ ట్రయిలర్ పేరుతో క్రిస్పీగా మరో ప్రోమో లాంచ్ చేసి.. బెటర్ రెస్పాన్స్ రాబట్టుకున్నారు. ట్రిపులార్ నుంచి కూడా ఇదే కాన్సెప్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ.. దర్శకుడ ధీరుడు రాజమౌళి మాత్రం.. మాకంత అవసరం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేశారు.
ట్రిపులార్ మొదటి ట్రయిలర్‌కి దేశవ్యాప్తంగా గుడ్ ఎప్లాజ్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్‌కి సంబంధించిన కట్‌షాట్స్‌ని, కంటెంట్ రిలేటెడ్ ఫ్లో దెబ్బతినకుండా పకడ్బందీగా కట్ చేసి.. ట్రయిలర్‌ని ఏటుజెడ్ పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్టు నార్త్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు రిలీజ్ ట్రయిలర్ పేరుతో మరొకటి రూపొందిస్తే అంతకంటే శక్తివంతంగా రాదేమో అనే అనుమానమే రాజన్నను ఈ విషయంలో వెనక్కు తగ్గేలా చేసింది. అందుకే.. సినిమా ఎండ్ కార్డ్స్‌తో పాటు ప్లే అయ్యే ‘ఎత్తర జెండా’ పాటతోనే సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్‌ని కిక్‌స్టార్ట్ చేశారు.
ఒక్కో భాషలో ఒక్కొక్క ఇంటర్వ్యూనిస్తూ ఆయా భాషల్లో ఆడియన్స్‌తో కనెక్టివిటీ సస్టెయిన్ చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ, ఫోర్సెస్ ఆఫ్ ట్రిపులార్ పేరుతో ఇంటర్నల్ టాక్.. ఇప్పటికే సినిమాకు కావల్సినంత బజ్‌ని తెచ్చేశాయి. కర్నాటకలో జరిగే గ్రాండ్ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో కనిపించే హైలైట్స్ గానీ, సైడ్‌లైట్స్ గానీ ట్రిపులార్‌ని మార్చి 25 వరకు డ్రైవ్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో వుంది టీమ్ ఆఫ్ ట్రిపులార్. చివర్లో సర్‌ప్రైజ్‌గా ఒక మేకింగ్ వీడియోను మాత్రమే రిలీజ్ చేయాలనేది జక్కన్న స్ట్రాటజీగా తెలుస్తోంది.
రాజా శ్రీహరి ( టీవీ9 ET డెస్క్)
మరిన్ని ఇక్కడ చదవండి :