AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.!

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Varanasi: మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.!
Varanasi
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2026 | 8:34 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిపై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసి విషయంలో మాత్రం ఆయన మరింత భారీగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రపంచ నిర్మాణం ఇలా ప్రతి అంశంలోనూ కొత్త అనుభూతిని అందించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారని టాక్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వారణాసిలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ప్రత్యేకమైన భాషను, లిపిని రూపొందించినట్లు సమాచారం.

కథలోని ఒక ప్రత్యేక ప్రపంచాన్ని మరింత సహజంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా చూపించేందుకు ఈ కొత్త భాషను ఉపయోగించనున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజమౌళి గతంలో బాహుబలి కోసం కిలికి అనే ప్రత్యేక భాషను సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాలోని కల్పిత ప్రపంచానికి తగ్గట్టుగా ఆ భాషను రూపొందించడం అప్పట్లో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఇప్పుడు వారణాసి కోసం కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నారనే వార్త సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.

అయితే ఈ కొత్త భాష సినిమాలో ఏ సందర్భంలో వినిపించనుంది.? దాని వెనుక ఉన్న ప్రపంచం ఏమిటి.? మహేష్ బాబు పాత్రకు దీనికి ఉన్న సంబంధం ఏంటి.? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉన్నాయి. మొత్తానికి రాజమౌళి వారణాసిని సాధారణ అడ్వెంచర్ సినిమాగా కాకుండా, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా రూపొందిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, వరుసగా బయటకు వస్తున్న ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us