Director Rajamouli: రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీలో చోటు..

|

Jun 26, 2024 | 12:01 PM

ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ)లో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజమౌళితోపాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.

Director Rajamouli: రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్ అకాడమీలో చోటు..
Rajamouli
Follow us on

ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిల్చోబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఆయన.. ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈగ, బాహుబలి 1, బాహుబలి  2 సినిమాతో జాతీయ స్థాయిలో రికార్డ్స్ సృష్టించిన జక్కన్న, ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచ దృష్టిని ఆకర్శించారు. ఈ మూవీ హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ)లో చేరాలని జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. రాజమౌళితోపాటు మొత్తం 487 మందికి ఈ ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.

2025లలో ఆస్కార్ అవార్డులకు ఓటు వేసేందుకు వీళ్లంతా అర్హత పొందారు. దర్శకధీరుడు రాజమౌళితోపాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం మరో విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి దంపతులకు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జక్కన్న దంపతులతోపాటు.. ఆస్కార్ అకాడమీలో మరికొంత మంది నటీనటులకు ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది.

అందులో భారత్ నుంచి వీరిద్దరితోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్, రీమాదాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేశ్ పాండ్యాల తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్నారు. “ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతుంది” అంటూ పోస్ట్ చేసింది గతేడాది రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, సెంథిల్ కుమార్ గతంలో ఈ ఆస్కార్ అకాడమీలో సభ్యత్వం పొందారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.