Srimanthudu: ముదురుతున్న శ్రీమంతుడు వ్యవహారం.. స్పందించిన చిత్రయూనిట్

2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కథ విషయంలో నానా రచ్చ జరుగుతోంది. తాను రాసుకున్న నవలలోని కథను కాపీ చేశారంటూ.. రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్టోరీని కాపీ చేశాం అని కొరటాల శివ ఒప్పుకోవాలని శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  

Srimanthudu: ముదురుతున్న శ్రీమంతుడు వ్యవహారం.. స్పందించిన చిత్రయూనిట్
Srimanthudu

Updated on: Feb 02, 2024 | 8:30 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కు మంచి హిట్ అందించింది. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కథ విషయంలో నానా రచ్చ జరుగుతోంది. తాను రాసుకున్న నవలలోని కథను కాపీ చేశారంటూ.. రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్టోరీని కాపీ చేశాం అని కొరటాల శివ ఒప్పుకోవాలని శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కథ పై వివాదం నడుతూనే ఉంది. దాంతో ఈ సినిమా కథ వ్యవహారంలో దర్శకుడు కొరటాల శివ పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. శివ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం పై తాజాగా శ్రీమంతుడు చిత్రయూనిట్ స్పందించింది.

శ్రీమంతుడు కథ పై తొందర పడి ఎవ్వరూ ఎలాంటి అభిప్రాయానికి రావద్దు అని తెలిపింది మూవీ టీమ్. శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ రెండూ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని , సినిమాను పరిశీలిస్తే వాస్తవాలను గమనించవచ్చు.. దయ చేసి ఎవ్వరూ ఓ అభిప్రాయానికి రాకండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది’ అంటూ మూవీ టీమ్ విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారం పై నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దాంతో సుప్రీం కోర్టు మెట్లెక్కారు.. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎప్పుడు సద్దుమణుగుతుందో..

Srimanthudu

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.