అతిలోక సుందరి దివికేగి అప్పుడే ఏడాది

అతిలోక సుందరి దివికేగి అప్పుడే ఏడాది

అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని వీడి అప్పుడే ఏడాది అవుతుంది. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసింది . ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి క‌ల‌గానే ఉంది. శ్రీదేవి ఫ్యామిలీ ఇప్ప‌టికి ఆమె జ్ఞాపకాల‌లోనే బ‌తుకుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వీ త‌న త‌ల్లితో ఉన్న అనుబంధాన్ని ఏదో ఒక సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఈ రోజు శ్రీదేవి వ‌ర్ధంతి సంద‌ర్బంగా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 24, 2019 | 1:06 PM

అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని వీడి అప్పుడే ఏడాది అవుతుంది. బోనికపూర్ సోదరి రీనా కుమారుడు పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసింది . ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి క‌ల‌గానే ఉంది. శ్రీదేవి ఫ్యామిలీ ఇప్ప‌టికి ఆమె జ్ఞాపకాల‌లోనే బ‌తుకుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వీ త‌న త‌ల్లితో ఉన్న అనుబంధాన్ని ఏదో ఒక సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఈ రోజు శ్రీదేవి వ‌ర్ధంతి సంద‌ర్బంగా త‌న త‌ల్లి చేయిప‌ట్టుకొని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా హృద‌యం ఎల్ల‌ప్పుడు భారంగానే ఉంటుంది. కాని నేను ఎప్పుడు న‌వ్వుతూనే ఉంటాను అందు కారణం ఆ న‌వ్వులో నువ్వున్నావు అని కామెంట్ పెట్టింది జాన్వీ.

ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా శ్రీదేవి వ‌ర్ధంతి సంద‌ర్బంగా ఆమెని గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్ లు పెడుతూ ఆమెని స్మ‌రించుకుంటున్నారు. అయితే తిథి ప్రకారం ఫిబ్రవ‌రి 14న చెన్నైలోని శ్రీదేవి ఇంట్లో ఆమె తొలి వ‌ర్ధంతిని నిర్వహించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu