Sridevi: అతిలోక సుందరి కన్నుమూసి ఆరేళ్లు.. శ్రీదేవితో సహా ఈ సినిమా తారల మరణం ఇప్పటికీ మిస్టరీయే..

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కొందరు అందాల తారలు అనుమానాస్పదంగా కన్నుమూశారు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఒకరు. ఆమె మరణించి నేటికి (ఫిబ్రవరి 24) ఆరేళ్లు. ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీనే. ఆమెతో పాటు రంగుల ప్రపంచంలో ధ్రువతారలా  మెరిసి హఠాత్తుగా రాలిపోయిన సినిమా తారలు చాలా మందే ఉన్నారు.

Sridevi: అతిలోక సుందరి కన్నుమూసి ఆరేళ్లు.. శ్రీదేవితో సహా ఈ సినిమా తారల మరణం ఇప్పటికీ మిస్టరీయే..
Mystery Deaths In Cinema In

Updated on: Feb 23, 2024 | 9:52 AM

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కొందరు అందాల తారలు అనుమానాస్పదంగా కన్నుమూశారు. అందులో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఒకరు. ఆమె మరణించి నేటికి (ఫిబ్రవరి 24) ఆరేళ్లు. ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీనే. ఆమెతో పాటు రంగుల ప్రపంచంలో ధ్రువతారలా  మెరిసి హఠాత్తుగా రాలిపోయిన సినిమా తారలు చాలా మందే ఉన్నారు. ఈ తారల మరణాల వెనక మిస్టరీని ఇప్పటివరకు ఛేదించలేకపోయారు

శ్రీదేవి

శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న మరణించారు. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా అనుమానాలున్నాయి. పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హఠాత్తుగా బాత్‌ టబ్‌లో శవమై కనిపించినట్లు భర్త బోని కపూర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం జూన్ 14, 2020న ముంబైలోని తన ఫ్లాట్‌లో వేలాడుతూ కనిపించింది. డిప్రెషన్‌తో చనిపోయాడని భావించారు. కానీఆఆ రోజు భవనంలో ఎలాంటి సీసీటీవీ పని చేయలేదు. దీంతో కొందరికి అనుమానం వచ్చింది. మరికొన్ని అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ కేసును ముంబై పోలీసులు సీసీబీకి అప్పగించారు. వారు ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా లేక మరణమా అనే అనుమానం ఇంకా కొనసాగుతోంది.

జియా ఖాన్

జియా ఖాన్ జూన్ 3, 2013న మరణించారు. ఆత్మహత్య చేసుకున్నాడని నప్రచారం సాగింది. జియా మరణానంతరం ఆమె ఇంట్లో ఆరు పేజీల లేఖ దొరికింది. అందులో సూరజ్ పంచోలి పేరును ప్రస్తావించింది. జియా, సూరజ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అతను చిత్రహింసలకు గురిచేశాడని జియా ఆరోపించింది. కేసు దర్యాప్తులో జియాది ఆత్మహత్య కాదని తేలింది.

సిల్క్ స్మిత

సిల్క్ స్మిత సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 1996 సెప్టెంబర్ 22న కన్నుమూసింది. సినిమా షూటింగ్‌ ముగించుకుని తిరిగి హోటల్‌కు చేరుకున్న సిల్క్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌లలో ఒకరికి ఫోన్ చేసి ఒక సమస్య గురించి మాట్లాడాలి అని చెప్పింది. అయితే ఉదయానికల్లా సిల్క్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇది కూడా మిస్టరీగా మిగిలిపోయింది.

పర్వీన్ బాబీ

2005 జనవరి 22న పర్వీన్ బాబీ మరణించింది. మూడు రోజులుగా ఆమె ఉంటున్న భవనంలో కిరాణా, న్యూస్ పేపర్ ఎవరూ తీసుకోకపోవడంతో అనుమానం వచ్చింది. చనిపోయి 72 గంటల తర్వాత కూడా ఈ దుర్వార్త వెలుగులోకి రాలేదు. పర్వీన్ చనిపోయే ముందు మూడు రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోలేదని వైద్యులు తెలిపారు.

దివ్య భారతి

1993లో దివ్య భారతి బాల్కనీ నుంచి పడి చనిపోయింది. తనను పరామర్శించేందుకు వచ్చిన నీతా లుల్లా ఎదుటే దివ్య మృతి చెందింది. అండర్ వరల్డ్ మాఫియాతో ఆమెకు సంబంధం ఉందని అప్పట్లో ప్రచారం సాగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.