
అక్కినేని యంగ్ హీరో , హాలీవుడ్ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్ కుర్రాడు.. ఇవన్నీ ఉన్నా.. అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదని చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఎం మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది.
చివరిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అఖిల్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడా.? అన్న క్యూరియాసిటీ పెరిగింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్ హిట్‌తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ సినిమా లైనప్ చేశాడని తెలుస్తుంది.
అంతే కాదు ఈ సినిమా కోసం ఆయా అందాల భామను కూడా కన్ఫర్మ్ చేశారని ఫిలిం సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. అఖిల్ ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రురల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో అఖిల్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఎంపికైందని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీని లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. కాగా శ్రీలీల నటించిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు తప్ప మారే సినిమా హిట్ అవ్వలేదు. ఇప్పటివరకు తెలుగులో శ్రీలీల 7 సినిమాలు చేసింది. కానీ రెండు హిట్స్ మాత్రమే అందుకుంది. రీసెంట్ గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.