Sreeleela: ఇట్స్ అఫీషియల్.. బాలయ్య సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల

తన అందంతో అల్లరితో కట్టిపడేసింది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా రెండు హిట్స్ రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి.

Sreeleela: ఇట్స్ అఫీషియల్.. బాలయ్య సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల
Sreeleela

Updated on: Mar 10, 2023 | 8:00 AM

వరుస విజయాలతో పాటు అవకాశాలు కూడా అందుకుంటూ దూసుకుపోతోంది లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల. ఈ చిన్నది పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ బ్యూటీ. తన అందంతో అల్లరితో కట్టిపడేసింది. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా రెండు హిట్స్ రావడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తోంది శ్రీ లీల. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది ఈ చిన్నది. అలాగే ఈ సినిమాలో మహేష్ తో ఓ సాంగ్ కూడా ఉండనుందట శ్రీ లీల తో..

ఇదిలా ఉంటే శ్రీ లీల బాలయ్య సినిమాలో చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే వీరసింహారెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ దక్కింది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అయితే ఈ మూవీలో బాలయ్య కూతురిగా శ్రీ లీల కనిపించనుందని అంటున్నారు. తండ్రి కూతురి మధ్య జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. అలాగే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.